బాబుకు ఆ అర్థం తెలుసా?: కన్నా

బాబుకు ఆ అర్థం తెలుసా?: కన్నా

ఎన్నికల దగ్గరకు రావడంతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. ఇవాళ విజయవాడలో ఆయన మాట్లాడుతూ ఓటమి భయంతోనే బాబు అర్థం కాని మాటలాడుతున్నారని అన్నారు. అందులో భాగమే శ్వేతపత్రాలని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబుకి శ్వేత పత్రం అర్థం తెలుసా? అని ప్రశ్నించారు. నిధులు, ఖర్చు, అప్పులు, దుబారా, ఓవర్ డ్రాఫ్ట్ అన్నీ కలిపి ఉంటే అది శ్వేత పత్రం అవుతుందన్న కన్నా.. చంద్రబాబు శ్వేత పత్రం అబద్ధాల పుట్టని అన్నారు. ప్రజలను మోసం చేయటమే బాబుకు తెలుసని ఆరోపించారు .