'మా ప్రధాని సింహం'

'మా ప్రధాని సింహం'

'మా ప్రధాని సింహం' అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రధాని భార్యపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఇవాళ గుంటూరులో ఆయన మాట్లాడుతూ 'మతిస్థిమితం లేని వ్యక్తిలా బాబు మాట్లాడుతున్నారని అన్నారు. ఆంబోతులా కొడుకు లోకేష్‌ని ప్రజలపైకి వదిలేశారు. టీడీపీ నేతలు కుక్కల్లా బీజేపీపై విరుచుకుపడుతున్నారు' అని అన్నారు. నిన్న ప్రధాని సభ గ్రాండ్‌ సక్సెస్‌ అయిందన్న కన్నా.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజలు తరలివచ్చారని చెప్పారు. కేంద్రం ఏం చేసిందో చెబుతున్నా కంఠశోషగా మారిందని.. ఏమీ చేయలేదని బాబు చెబుతుంటే అదే హైలైట్‌ అవుతోందని అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ కలిసి ఎయిమ్స్, ఎయిర్‌ పోర్ట్‌, జాతీయ రహదారి అభివృద్ధి పనుల్లో కమీషన్‌ తీసుకున్నారని ఆయన ఆరోపించారు.