అదో పెద్ద దొంగల కూటమి: కన్నా

అదో పెద్ద దొంగల కూటమి: కన్నా

అవినీతిపరులంతా కలసి మహాకూటమి అంటున్నారు.. అదో పెద్ద దొంగల కూటమి అని ఏపీ బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో కన్నా లక్ష్మీనారాయణ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దొంగల కూటమి అంతా మహాకూటమిగా ఏర్పడి ఎన్ని కుట్రలు చేసినా.. ప్రజలు నరేంద్ర మోడీ పాలననే స్వాగతిస్తున్నారన్నారు. నారా లోకేష్, చంద్రబాబు నాయుడుల అవినీతి బయటపెట్టడానికి మేం సిద్ధం.. నిరూపించలేకపోతే జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమని తెలిపారు. తండ్రికొడుకులు అంత నీతిమంతులు అయితే.. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని కన్నా ఎద్దేవా చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఆరోపణలు వస్తే.. ఆయన స్వయంగా సీబీఐ ఎంక్వైరీ వేయించుకున్నారు. లోకేష్, చంద్రబాబులకు ధైర్యం ఉంటే సీబీఐ ఎంక్వైరీ వేయించుకొని నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. 2014లో సోనియా గాంధీపై అనేక ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు సోనియాతో నడవడం సిగ్గుచేటని కన్నా విమర్శించారు.