సొమ్ము కేంద్రానిది... సోకు చంద్రబాబు ది...

సొమ్ము కేంద్రానిది... సోకు చంద్రబాబు ది...

సొమ్ము కేంద్ర ప్రభుత్వానిది... సోకు సీఎం చంద్రబాబు ది అని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... వ్యవసాయ రంగాన్ని సీఎం చంద్రబాబు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్టంలో అసమర్థత, అవినీతే రాజ్యమేలుతోందని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తున్నా హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన కన్నా లక్ష్మీనారాయణ... కేంద్రం, ఏపీకి స్కీమ్స్ ఇస్తే వాటిలో టీడీపీ ప్రభుత్వం స్కామ్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు స్పెషల్ ప్యాకేజి కింద నిధులు తీసుకుంటూనే... మరోవైపు హోదా ఇవ్వలేదని తెలుగుదేశం దుష్ప్రచారం చేస్తోందన్నారు. బీజేపీ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెబుతున్నామని తెలిపిన కన్నా... టీడీపీ చేసిన అభివృద్ధి గురించి చెప్పే దమ్ము సీఎం చంద్రబాబుకు ఉందా? అని సవాల్ విసిరారు.