ప్రజాకూటమిని బాబు నిలువునా ముంచాడు..

ప్రజాకూటమిని బాబు నిలువునా ముంచాడు..

నమ్మించి మోసం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబును మించిన నేత మరొకరు లేరు... జాతీయ స్థాయిలో చక్రాలు తిప్పుతానని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ప్రజాకూటమిని నిలువునా ముంచారని వ్యాఖ్యానించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన... ఆంధ్ర ప్రజల మనస్సులో బీజేపీపై విషప్రచారం చేశారని... మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి చేసిన అభివృద్ది ప్రజలకు చెప్పేందుకే ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఈ రోజు  రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్న ప్రతి అభివృద్ది కార్యక్రమం మోడీ ప్రభుత్వ నిధులేనని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా పోటి చేసినా గట్టి పోటి ఉండేదేమోనన్న కన్నా లక్ష్మీనారాయణ... చంద్రబాబు కాలు మోపగానే తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి... తెలంగాణ ప్రజలు చంద్రబాబు దోపిడీని అరాచకాన్ని వ్యతిరేకించారు.. కూకట్‌పల్లిలో టీడీపీ ఓటమికి చంద్రబాబే కారణం అన్నారు కన్నా... మరోవైపు 2019లో టీడీపీకి ప్రజలు గట్టిగానే సమాధానం చెబుతారని హెచ్చరించారు.