'చంద్రబాబుపై దేశద్రోహం కేసు పెట్టాలి..'

'చంద్రబాబుపై దేశద్రోహం కేసు పెట్టాలి..'

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తూర్పుగోదావరి  జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాశ్మీర్ ఉగ్రవాది దాడి ప్రధాని నరేంద్ర మోడీ పనే అని ఆరోపించిన సీఎం చంద్రబాబుపై దేశద్రోహం నేరంపై కేసు నమోదు చేయాలన్నారు. సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించిన కన్నా.. చంద్రబాబు వ్యాఖ్యలు గర్హనీయం అన్నారు.