'నన్ను ఫినిష్ చేసేందుకు కుట్ర..'

'నన్ను ఫినిష్ చేసేందుకు కుట్ర..'

నన్ను హత్య చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ, ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ... ఇవాళ కన్నా నివాసాన్ని ముట్టడించేందుకు టీడీపీ కార్యకర్తలు రాగా... బీజేపీ-టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... నిన్న కాకినాడ పర్యటనలో సీఎంకు స్థానిక బీజేపీ నేతలు సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారి... సమయం ఇవ్వకపోగా బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఇక ఓ మహిళను నడిరోడ్డు మీద సీఎం చంద్రబాబు ఫినిష్ చేస్తానని హెచ్చరించారని గుర్తుచేసిన కన్నా... ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఇవాళ నన్ను చంపడానికి టీడీపీ వాళ్లు వచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకే టీడీపీ శ్రేణులు నన్ను ఫినిష్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నాపై జరిగిన హత్య యాత్నంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు కన్నా లక్ష్మీనారాయణ. గతంలో అమిత్ షా, జగన్, పవన్‌పై... ఇప్పుడు నాపై హత్యాయత్నం జరిగిందన్నారు. ఈ ఘటనలు అన్నింటిపై గవర్నర్ దృష్టి సారించి శాంతి భద్రతలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు కన్నా.