రిపబ్లిక్ డేను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు

రిపబ్లిక్ డేను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు

ఏపీ సీఎం చంద్రబాబు రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సోమవారం ఆయన విజయవాడలో మాటాడుతూ... గణతంత్ర దినోత్సవం శకటం ఎంపికలోనూ చంద్రబాబు రాజకీయం జోడించటం సరికాదన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారానికి ఇది పరాకాష్ట. చంద్రబాబు రిపబ్లిక్ దినోత్సవాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన శకటాన్ని తిరస్కరించటాన్ని కేంద్రం కుట్రగా చంద్రబాబు చెప్పటం దారుణం అని కన్నా పేర్కొన్నారు.

శకటాలను తిరస్కరించటం ఇదే తొలిసారి కాదు. గతంలో వైయస్, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో కూడా జరిగింది. తెలంగాణ రాష్ట్ర శకటాన్ని గత మూడేళ్లుగా తిరస్కరిస్తున్నారు. సరైన ప్రమాణాలు పాటించకున్నా, నమూనా బాగాలేకపోయినా, ఆలస్యంగా పంపినా కమిటి తిరస్కరిస్తుందని కన్నా తెలిపారు.