టీడీపీ ఓ డ్రామా కంపెనీ: కన్నా

టీడీపీ ఓ డ్రామా కంపెనీ: కన్నా

టీడీపీ ఓ డ్రామా కంపెనీ అని.. సీఎం చంద్రబాబులా తాము రోజుకో వేషం వెయ్యలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  తెలంగాణాలో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఏపీలో ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే  రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎస్పీవీ ఏర్పాటు చేయడంలేదని కన్నా మండిపడ్డారు.

ప్యాకేజీని సమర్ధించిన తీర్మానాలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించారని కన్నా తెలిపారు. చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో  ఒంటరిగానే పోటీ చేస్తాం. అధికారంలోకి రావడమే లక్ష్యం అని అన్నారు. ఈ నెల 21న రాజమండ్రిలో ఐదు పార్లమెంట్ శక్తి  కేంద్రాల ప్రముఖులతో అమిత్‌షా సమావేశం అవుతారని కన్నా  పేర్కొన్నారు.