రాజధాని అమ్మడానికి ప్రభుత్వం కుట్ర !

రాజధాని అమ్మడానికి ప్రభుత్వం కుట్ర !

ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్షను చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఆయన ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దీక్షకు దిగారు. అమరావతి ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రదేశంలో దీక్ష చేపట్టారు. పవిత్ర నీరు, మట్టి ఉంచిన ప్రాంతానికి నమస్కరించి ఆయన దీక్షను ప్రారంభించారు.  గంట పాటు ఈ మౌన దీక్ష కొనసాగింది. అనంతరం కన్నా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కేంద్రం నిధులిచ్చిందని అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయటానికి ప్రయత్నాలు చేసిందని ఇప్పుడు జగన్ ఏకంగా రాజధానిని అమ్మడానికి చూస్తున్నారని అన్నారు. రాజధానికి అడ్రెస్ లేకుండా జగన్ ..నిలువునా ముంచుతాడని ప్రజలు ఊహించలేదని, ఎన్నికల్లో పెట్టుబడి పెట్టి అధికారంలోకి వచ్చి దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రాజధాని ఉండగా gn రావు కమిటీ వేయటం కమిటీ రిపోర్ట్ కి ముందే జగన్ మాటలాడటం చూస్తే ఇదంతా వారి జగిరుగా భావిస్తున్నారని అనుకోవాలని అన్నారు. కాబినెట్ నిర్ణయం తరువాత భవిష్యత్  కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.