11 ఏళ్ల తరువాత... విజయ్ దేవరకొండ సినిమాతో...

11 ఏళ్ల తరువాత... విజయ్ దేవరకొండ సినిమాతో...

విజయ్ దేవరకొండ సినిమాలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది.  తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు బాగా ఆడుతుంటాయి.  విజయ్ తెలుగులో బాగా బిజీ అయ్యాడు.  వరసగా సినిమాలు చేస్తున్నాడు.  ప్రసుత్తం డియర్ కామ్రేడ్ తో బిజీగా ఉన్న విజయ్ ఈ సినిమా తరువాత మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న స్పోర్ట్స్ డ్రామా మూవీలో బైక్ రేసర్ గా కనిపిస్తున్నారు.  

11 సంవత్సరాల క్రితం అంటే 2008 వ సంవత్సరంలో ఎంఎస్ రాజు నిర్మాణంలో వచ్చిన వాన సినిమాలో కీలక పాత్ర పోషించిన దిగంత్, విజయ్ సినిమా ద్వారా తిరిగి టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.  వాన సినిమా తరువాత ఈ కన్నడ యాక్టర్ టాలీవుడ్ లో సినిమాలు చేయలేదు.  బహుభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కు జోడిగా మాళవిక మోహనన్, షాలిని పాండేలు నటిస్తున్నారు.  ఆనంద్ అన్నామలై దర్శకుడు.