కన్నడ గాయనికి వేధింపులు

కన్నడ గాయనికి వేధింపులు

ప్రముఖ కన్నడ గాయని వసుంధరా రాజ్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె కారులె వెళ్తున్నప్పుడు బెంగళూరులోని భాష్యం సర్కిల్లో సిగ్నల్ పడినచోట కారు ఆపింది. లెఫ్ట్ సైడ్ లో ఓ క్యాబ్ ఆగి ఉంది. గ్రీన్ సిగ్నల్ పడగానే.. ఆ క్యాబ్ డ్రైవరు రైట్ కు వెళ్లేందుకు ప్రయత్నించడం.. అదే సమయంలో వసుంధర స్ట్రయిట్ గా వెళ్లడంతో క్యాబ్ డ్రైవర్ కారు నిలిపేయాల్సి వచ్చింది. దీంతో రెచ్చిపోయిన అతను 4 కిలోమీటర్లు ఫాలో అయ్యాడు. మరో జంక్షన్లో వసుంధర కారు పక్కనే తన కారును ఆపి.. కారులోంచి దిగి అసభ్యంగా అరవడం, తిట్టడం, సెక్సువల్ బాడీ లాంగ్వేజ్ తో విపరీతంగా అవమానించాడు. దీంతో ఆమె మల్లేశ్వరం పీఎస్ లో కంప్లయింట్ ఇచ్చింది. 

క్యాబ్ డ్రైవర్ మీద లైంగిక వేధింపులు, దుర్భాషలు, న్యూసెన్స్ కింద కేసులు బుక్ చేశారు.