ఇదేం ట్రైలర్ బాబు.. బిల్డప్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువ..!!

ఇదేం ట్రైలర్ బాబు.. బిల్డప్ ఎక్కువ.. మ్యాటర్ తక్కువ..!!

సౌత్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాలంటే ఇటీవల కాలంలో చెప్పుకునేవి బాహుబలి, కేజీఎఫ్ గురించే.  ఈ రెండింటికి మంచి పేరు వచ్చింది.  రాజమౌళి ఆలోచనల నుంచి బాహుబలి తెరకెక్కితే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ తెరెకెక్కింది.  ఈ రెండు సినిమాలో భారీ కలెక్షన్లు వసూలు చేశాయి.  కేజీఎఫ్ ఊహించని విధంగా రూ. 350 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  

కేజీఎఫ్ తరువాత కన్నడలో అలాంటి భారీస్థాయి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఇదే కోవలో పౌరాణిక గాథ మహాభారతాన్ని ఆధారంగా చేసుకొని దర్శన్ హీరోగా కురుక్షేత్ర సినిమా చేస్తున్నారు.  క్లుప్తంగా చెప్పాలి అంటే అప్పట్లో పెద్ద ఎన్టీఆర్ చేసిన దానవీర శూర కర్ణ సినిమా లాంటిది.  కురుక్షేత్రలో దర్శన్ సుయోధనుడిగా కనిపిస్తున్నారు.  

దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.  ట్రైలర్ అంటే మెయిన్ కంటెంట్ గురించి.. సినిమాలో ఉన్న అద్భుతమైన విషయాల గురించి చూపించాలి.  అందులోను పౌరాణిక సినిమా కావడంతో దానిని ప్రమోట్ చేసుకోవడం చాలా అవసరం.  దాదాపు వంద కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి తీస్తున్న ఈ సినిమా ట్రైలర్ విషయంలో మ్యాటర్ ను తక్కువ చూపించి సినిమా బ్యానర్ గురించే సగం ట్రైలర్ సమయం ఖర్చు చేస్తే ఎలా చెప్పండి.  

ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని ఎదురు చూసిన నెటిజన్లు ఈ ట్రైలర్ ను చూసి కామెంట్స్ చేస్తున్నారు.  మ్యాటర్ ను పక్కన పెట్టి ఇదేంటి అని ప్రశ్నిస్తుండటంతో.. యూనిట్ షాక్ అయ్యింది.  అప్పటికే జరగాల్సిన పొరపాటు అంతా జరిగిపోయింది.  ఇప్పుడు ఆకులు పట్టుకుంటే పట్టుకుంటే ఉపయోగం ఏముంటుంది.  త్వరలోనే మరలా మరో ట్రైలర్ రిలీజ్ చేస్తారేమో చూడాలి.