ఎన్డీయేలో వైసీపీ చేరికపై కన్నా కామెంట్స్‌ 

ఎన్డీయేలో వైసీపీ చేరికపై కన్నా కామెంట్స్‌ 

'ఆంధ్రప్రదేశ్‌లో మేం ప్రజల పక్షాన ఉంటాం. వైసీపీకి మేం మిత్రపక్షం కాదు. ఎన్డీయేలో వైసీపీ చేరుతుందన్న వార్తల్లో నిజం లేదు' అని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఇవాళ ఆయన గుంటూరులో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మించాలంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర పార్టీల నుంచి ద్వితీయ శ్రేణి నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. మోడీ తన ఐదేళ్ల పాలనలో పేదరిక నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, దేశ రక్షణ కోసం పని చేశారని.. ఏం చేశారో చెప్పి ఎన్నికలకు వెళ్లి మళ్లీ విజయం సాధించారని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.