అరె... అచ్చంగా అలానే ఉన్నాడే...!!

అరె... అచ్చంగా అలానే ఉన్నాడే...!!

బాలీవుడ్ లో స్పోర్ట్స్ స్టార్స్ జీవితం ఆధారంగా సినిమాలు తీస్తున్నారు.  ఈ బేస్డ్ లో వచ్చే సినిమాలకు అక్కడ మంచి గిరాకీ ఉండటంతో ఆ జానర్లోనే సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  ఇప్పటికే అనేకమంది జీవితాలకు సంబంధించిన సినిమాలు వచ్చాయి.  ఇప్పుడు తాజాగా కపిల్ దేవ్ జీవితం ఆధారంగా 83 సినిమా వస్తోంది.  1983లో వరల్డ్ కప్ తీసుకొచ్చిన కపిల్ జీవితం ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది.  

సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను రణ్వీర్ సింగ్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దానికి నటరాజ్ షాట్ అని పేరు పెట్టాడు.  ఈ ఫోటోలో రణ్వీర్ ను చూస్తుంటే... అచ్చంగా కపిల్ దేవ్ ఉన్నట్టుగానే ఉన్నాడు.  సేమ్ టు సేమ్ డిటో అన్నమాట.