ఐసీసీ వరల్డ్‌ కప్‌: కపిల్‌ చెప్పిన ఫేవరెట్ జట్లు ఇవే..!

ఐసీసీ వరల్డ్‌ కప్‌: కపిల్‌ చెప్పిన ఫేవరెట్ జట్లు ఇవే..!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమైంది... ఈ నెలాఖరులో క్రికెట్ వరల్డ్ కప్ ఆరంభం కానుంది. అయితే, ఈ సారి రాణించే జట్లు ఏవి? సెమీస్‌కు చేరు టీమ్‌లు ఏవి? ఫైనల్‌లో అడుపెట్టే ఆ రెండు జట్లు ఏవి? అసలు కప్ గెలుచుకునే జట్లు ఏవీ అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి. 1983లో క్రికెట్ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు సారథ్యంవహించిన లెజెండ్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్  కపిల్ దేవ్‌ కూడా ఓ అంచనా వేశారు. ఈసారి వరల్డ్ కప్‌ను గెలుచుకునే సత్తా టీమిండియాకు ఉందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత జట్టులో యువరక్తంతో పాటు అనుభవం సమపాళ్లలో ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. అయితే జట్టు కూర్పుతో పాటు అవసరమైన సమయంలో ఆటగాళ్లు రాణించడం చాలా ముఖ్యమని విషయమన్నారు. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సెమీ ఫైనల్స్‌లో చోటు సాధించే అవకాశం ఉందని అంచనా వేసిన కపిల్ దేవ్.. సెమీస్‌లో నాలుగో బెర్త్ కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు పోటీపడతాయన్నారు. ఇక ఈ టోర్నీలో న్యూజిలాండ్ లేదా వెస్టిండీస్ సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు కపిల్. మరోవైపు హార్దిక్ పాండ్యా జట్టులో ఉండడం టీమిండియాకు కలిసివచ్చే అంశమన్న ఆయన.. పాండ్యాను అతని సహజశైలిలో ఆడనివ్వాలని సూచించారు. ఇక ఈ నెల చివరిలో ప్రారంభం కానున్న క్రికెట్ వరల్డ్ కప్‌లో నిలిచేది ఎవరో.. కప్ కొట్టేది ఎవరో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.