బాలీవుడ్ లోకి కపిల్ దేవ్ కూతురు

బాలీవుడ్ లోకి కపిల్ దేవ్ కూతురు

1983 సంవత్సరం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది క్రికెట్.  ఇండియన్ క్రికెట్ టీమ్ మొదటిసారి క్రికెట్ వరల్డ్ కప్ ను గెలుచుకుంది. వరల్డ్ కప్ ను గెలవడంతో సారధి కపిల్ దేవ్ ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  కపిల్ జీవిత చరిత్ర ఆధారంగా 83 అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్నది.  రణ్వీర్ సింగ్ కపిల్ పాత్రను పోషిస్తున్నారు.  

కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ మే నుంచి ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమా కోసం రణ్వీర్ సింగ్ చాలా రోజుల నుంచి గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు.  ఇదిలా ఉంటె, ఈ సినిమా ద్వారా కపిల్ కూతురు అమియా వెండితెరకు పరిచయం కాబోతున్నది.  వెండితెరకు అంటే హీరోయిన్ గా కాదు...  అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేందుకు సిద్ధం అవుతుందట.  తన తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం రావడం హ్యాపీగా ఉందని అంటోంది అమియా.  ఏప్రిల్ 10, 2020 న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.