హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కపిల్ దేవ్..

హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన కపిల్ దేవ్..

భారత జట్టుకు మొదటి ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ గుండెపోటుతో బాధపడుతూ ఆస్ప‌త్రిలో చేరిన విషయం తెలిసిందే. తర్వాత తన ఆరోగ్యంపై స్వయంగా కపిల్ దేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని, క్షేమంగా ఉన్నానని పేర్కొన్నాడు కపిల్ దేవ్. తన ఆరోగ్యం గురించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో హాస్పిటల్ నుండి డీఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని మరో మాజీ ఆటగాడు చేతన్ శర్మ ట్విట్టర్ వేదికగా తెలిపారు. కపిల్ దేవ్ కు యాంజియోప్లాస్టీ సర్జరీ చేసిన డాక్టర్ తో ఆయన దిగ్గిన ఫోటోను చేతన్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు.. ఇంటికి చేరుకున్నారు అని పేర్కొన్నారు. ఇక 1983 ప్రపంచ కప్ ఫైనల్ లో క‌పిల్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌ను ఓడించి భార‌త్‌ ప్ర‌పంచ ఛాంపియ‌న్‌ గా నిలిచింది.