భారత్ కు పాక్ తో మ్యాచ్ ఆడాల్సినంత గతి పట్టలేదు : కపిల్ దేవ్

భారత్ కు పాక్ తో మ్యాచ్ ఆడాల్సినంత గతి పట్టలేదు : కపిల్ దేవ్

కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి నిధులు సేకరించడానికి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సిరీస్ నిర్వహించాలని పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదనపై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కొంచెం ఘాటుగానే స్పందించాడు. కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి నిధులకోసం పాకిస్థాన్ తో  మ్యాచ్ ఆడాల్సినంత గతి ఇంకా భారత్ కు పట్టలేదు అని తెలిపాడు. కరోనా విజృంభిస్తున్న ఇటువంటి సమయంలో ఆట ఆడించే ఉదేశ్యం బీసీసీఐ కి లేదు అని అన్నాడు. బీసీసీఐకి తమ ఆటగాళ్ల ఆరోగ్యం మరియు ప్రాణాలే ముఖ్యం అని వివరించాడు. ఇంతక ముందే ఈ కరోనాను ఎదుర్కోవడానికి పీఎం సహాయనిధికి 51 కోట్లు విరాళంగా ఇచ్చిన బీసీసీఐ కావాలంటే ఇంకా ఇచ్చే పరిస్థితుల్లోనే ఉంది అంతే కానీ పాక్ తో మ్యాచ్ మాత్రం ఆడించదని వెల్లడించారు.  ఈ భారత్-పాక్ సిరీస్ కేవలం అక్తర్ సొంత ఆలోచన మాత్రమే అని అన్నాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో ఐదు నెలల వరకు అసలు క్రికెట్ గురించి మర్చిపోతే బాగుంటుంది అని అన్నారు. ఈ సమయం లో మ్యాచ్ కంటే ముందు ఈ రెండు దేశాలు పరస్పరం ఎలా సహాయం చేసుకుంటాయి అనేది చూడాలి అని అన్నాడు.