కపిల్ దేవ్ కు కూడా అతని చూస్తే భయమేసిందట.. !

కపిల్ దేవ్ కు కూడా అతని చూస్తే భయమేసిందట.. !

1983 లో భారత్ కు మొదటిసారి ప్రపంచ కప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్. భారత నెంబర్ 1 ఆల్ రౌండర్ గా నిలిచిన ఈయన చాలామంది బౌలర్లకు తన బ్యాటింగ్ తో అలాగే బ్యాట్స్మెన్లకు తన బౌలింగ్ తో భయం పుటించాడు. అలాంటిది ఈయనకు కూడా ఒకరంటే చాల భయమట. కానీ అది ఏ ప్రత్యర్థి జట్టు ఆటగాడో కాదు భారత జట్టు ఒకప్పటి కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అని చెప్పి అందరిని ఆశ్ఛర్య పరిచాడు. ఈ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో కపిల్ మాట్లాడుతూ... అప్పటి భారత్ జట్టు కెప్టెన్ శ్రీనివాస్ వెంకట్రాఘవన్ అంటే నాకు చాల భయం. ఆయన ఉంటె నేను ఓ మూలకు వెళ్లి బ్రేక్‌ఫాస్ట్ చేసేవాడినని అని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా... మాములుగా టెస్ట్ లో టీ బ్రేక్ ఇస్తారు. దానికి ఆయన దీని టీ బ్రేక్ అనే ఎందుకు అన్నాలి, కాఫీ బ్రేక్ అని అనకూడద అంటూ వాదించేవారు. అలాగే ఆయనకు చాల కోపం అని తెలిపారు. 1960-1970లో భారత్ స్పిన్నర్‌గా  రాణించిన వెంకట్రాఘవన్ 57 టెస్టులు ఆడి మొత్తం 156 వికెట్లు తీసుకున్నాడు. అలాగే కపిల్ దేవ్ ప్రపంచ కప్ గెలిచినా 1983లోనే తన రిటైర్మెంట్ ప్రకటించాడు.