ఇద్దరు కెప్టెన్లను పెడితే గొడవలు అవుతాయి...
ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ ముంబైకి రోహిత్ అందించడంతో.. భారత పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పగ్గాలను రోహిత్‌కు ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇద్దరు కెప్టెన్లు ఉంటే తప్పేంటని, విరాట్ కోహ్లీకి కూడా వర్క్ లోడ్ తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లు ఇలా కెప్టెన్సీ విభజనతో సక్సెస్‌ని అందుకోవడాన్ని కూడా కొందరు గుర్తుచేస్తున్నారు. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అయితే రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోతే దేశానికే నష్టమనే వ్యాఖ్యలు కూడా చేశాడు. అయితే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పదించారు. విరాట్ కోహ్లీ టీ20ల్లో ఆడుతుంటే.. కెప్టెన్‌గానూ అతడినే కొనసాగించాలి. అతడు బాగానే ఆడుతున్నాడు. జట్టులో మరో కెప్టెన్ కూడా ఉండాలనే నిర్ణయాన్ని నేనూ స్వాగతిస్తా. కానీ అది చాలా కష్టం' అని కపిల్ దేవ్ అన్నారు. మూడు ఫార్మాట్లలో దాదాపుగా 70-80 శాతం ఒకటే జట్టు. భారత వన్డే, టీ20, టెస్టు జట్టులో ఆడుతుంటుంది. సారథులు విరుద్ధమైన పద్ధతులు అవలంభిస్తే.. వారికి నచ్చవు. ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తుతాయి. ఇద్దరు సారథులు ఉంటే జట్టు వాతావరణం మారిపోతుంది. ఫలానా వ్యక్తి టెస్టుల్లో సారథి కాబట్టి అతడికి కోపం తెప్పించకూడదు అని ఆటగాళ్లు ఆలోచిస్తారు' అని కపిల్ దేవ్ పేర్కొన్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)