విశాఖలో కపిల్ దేవ్ సందడి

విశాఖలో కపిల్ దేవ్ సందడి

విశాఖలో క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సందడి చేసారు. ఎంవివిటి 10 చాంపియన్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు కపిల్ దేవ్ బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆస్ట్రేలియాలో చారిత్రక టెస్ట్ విజయం అందుకున్న భారత జట్టుకు అభినందనలు. నేను ఆటను ఎంజాయ్ చేశాను. నాకు దక్షిణాది అంటే ఎంతో ప్రేమ.. నాకు తెలుగు రాకపోయినా మీ అభిమానాన్ని అర్ధం చేసుకున్నాను అని అన్నారు. టి-10 క్రికెట్ ట్రోఫీని 36 రోజుల పాటు 450 జట్లతో నిర్వహించడం ఇంతవరకూ చూడలేదని కపిల్ అన్నారు.