ఫ్రెండ్స్ కు ఆహ్వానం.. మోడీది తేల‌లేదు

ఫ్రెండ్స్ కు ఆహ్వానం.. మోడీది తేల‌లేదు

వ‌చ్చేవారం ఇస్లామాబాద్ లో జ‌రిగే ఇమ్రాన్ ఖాన్  ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ప్ర‌ధాని మోడీని పిలుస్తారా లేదా అన్న విష‌య‌మై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.  త‌న పాత మిత్రుల‌ను  ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానించారు. ఇప్ప‌టికే భార‌త అధికారుల‌కు అతిధుల జాబితా అందింది. విశ్వ‌సనీయ స‌మాచారం మేర‌కు క్రికెట‌ర్లు సునీల్ గ‌వాస్క‌ర్, క‌పిల్ దేవ్‌, న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూల‌తో పాటు సినిమా న‌టుడు అమీర్ ఖాన్ ల‌ను ఇమ్రాన్ ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. ఇత‌ర ప్రముఖుల వివ‌రాలు  ఇంకా వెల్ల‌డి కాలేదు. ప్ర‌ధాని మోడీతో పాటు సార్క్ దేశాల అదిప‌తుల‌ను ఇమ్రాన్ ఆహ్వానిస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే దీనికి సంబంధించి వివ‌రాలు ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది.