అమల్లోకి వచ్చిన కాపు రిజర్వేషన్

అమల్లోకి వచ్చిన కాపు రిజర్వేషన్

ఏపీలో కాపు రిజర్వేషన్ చట్టం అమల్లోకి వచ్చింది. ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తూ చట్టం తీసుకొచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్‌ను రాష్ట్రంలోని కాపులు, అగ్రవర్ణ పేదలకు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త చట్టంతో 5 శాతం కాపులకు, మరో 5 శాతం అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్‌ లభిస్తుంది. ఈ కొత్త చట్టం వలన కాపులకు, ఈబీసీలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ లభిస్తుంది. కాపులకు ఐదు శాతం, ఈబీసీలకు ఐదు శాతం రిజర్వేషన్‌ను అమల్లోకి తెచ్చినట్టు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజర్వేషన్లు వర్తించని అగ్రవర్ణాల్లోని బ్రాహ్మణులు, రెడ్డి, కమ్మ తదితర సామాజిక వర్గాలకు కూడా విద్యా, ఉద్యోగ రంగాల్లో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.