కేంద్రంలో రానుంది సంకీర్ణమే : ఎంపీ వినోద్

కేంద్రంలో రానుంది సంకీర్ణమే : ఎంపీ వినోద్

రానున్న రోజుల్లో కేంద్రం లో రానున్నది సంకీర్ణ ప్రభుత్వమేనని కరీంనగర్ టీఆర్ఎస్ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.గంగాధర మండలం బూరుగుపల్లి లో ఆయన మీడియాతో మాట్లాుడుతూ.. తెలంగాణ రాష్ట్రం లోని 17 పార్లమెంట్ లో 16 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసారు.సియం కేసిఆర్ కేంద్రంలో ముఖ్య భూమిక పోషించానున్నారని ఎంపీ వినోద్ తేల్చి చెప్పారు. 

గత ప్రభుత్వాల హాయంలో ప్రాజెక్టుల అనుమతులకు నాలుగు నుండి ఐదేళ్లు పట్టేది, కానీ తెలంగాణ ఎంపీలం నాలుగైదు నెలల్లో సాధించామని ఎంపీ వినోద్ చెప్పుకొచ్చారు. ఎస్ఆర్ఎస్ పి వంటి ప్రాజెక్టు నిర్మాణానికి 20 ఏళ్లు పట్టింది.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ప్రాజెక్టులు మూడు నాలుగు ఏళ్లలోనే పూర్తి చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఎంపీ వినోద్ కుమార్ చెప్పారు. మేడిగడ్డ,అన్నారం,సుందిల్ల, తుమ్మిడి హెడ్డి వద్ద ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని ఆయన వివరించారు.

తెలంగాణలో అమలౌతున్న పథకాలను ఒడిషా,కర్నాటక, బెంగాల్  రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, వారి రాష్ట్రంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కరీంనగర్ ఎంపీ చెబుతున్నారు. కరీంనగర్ నాలుగు జాతీయ రహదారుల‌ కూడలిగా  ఉందని, త్వరలోనే ఇక్కడ జాతీయ రహదారుల ఎస్ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నామని వివరించారాయన ఆచరణకు సాధ్యం కాదని ప్రతిపక్షాలు అన్నచోటే. కరీంనగర్ కు స్మార్ట్ సిటీని సాధించి రానున్న రోజుల్లో వెయ్యి కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామని తెగేసి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు కు జాతీయ హోదా కల్పించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ విభజన చట్టంలో మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేలా చేర్చకపోవడం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదమని ఎంపీ వినోద్ కుమార్ తప్పుపట్టారు.