వారిద్దరి కెప్టెన్సీ టెక్నిక్ ఒక్కటే... 

వారిద్దరి కెప్టెన్సీ టెక్నిక్ ఒక్కటే... 

ప్రపంచ కప్ విజేత మాజీ కెప్టెన్ ధోని పై ప్రశంసలు కురిపిస్తూ, ప్రపంచ క్రికెట్‌లో తమ జట్టు సభ్యులకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడంలో ఎంఎస్ ధోని కంటే మెరుగైన వారి ఎవరు లేరు అని ఇండియా లెగ్ స్పిన్నర్  కర్ణ్ శర్మ అన్నారు. 2014 లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన ఈ శర్మ..  రోహిత్ శర్మ, ధోని  కెప్టెన్సీ టెక్నిక్ ఒక్కటే అని తెలిపాడు. అయితే వీరిద్దరూ ఐపీఎల్ లోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లు. ఐపీఎల్ లో ధోని, రోహిత్ ఇద్దరి  కెప్టెన్సీ లో ఆడిన శర్మ మాట్లాడుతూ.. ఈ ఇద్దరు కెప్టెన్ లు ఫీల్డ్ సెట్ చేసే విషయం లో బౌలర్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు. బహుశా... ధోనీ నుండే రోహిత్ శర్మ ఆ టెక్నిక్  నేర్చుకున్నాడు కావచ్చు. ఎందుకంటే.. ధోనీ కెప్టెన్సీలో రోహిత్ శర్మ చాలా ఏళ్లు ఆడాడు. మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేయడం లో కలుగజేసుకోరు. ఒకవేళ అందులో బౌలర్ విఫలమైతే వాళ్ళు ఎంట్రీ  ఇస్తారు. అలాగే మరొకటి వారు ప్రశాంతతకు మారుపేరులాగా కనిపిస్తారు అని శర్మ వెల్లడించాడు.