ధనుష్ ‘కర్ణన్’ కలెక్షన్స్.. అదుర్స్!

ధనుష్ ‘కర్ణన్’ కలెక్షన్స్.. అదుర్స్!

హీరో ధనుష్‌ తాజా చిత్రం ‘కర్ణన్‌’ ఈనెల 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయిన సంగతి తెలిసిందే. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలై వారం అవుతున్న చెన్నై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టుకుంటుంది. వి.క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత కలైపులి ఎస్‌ థాను నిర్మించిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి మారి సెల్వరాజ్‌ దర్శకత్వం వహించారు. సంతోష్‌ నారాయణన్‌ సంగీత బాణీలు సమకూర్చిన ఈ చిత్రంలో ధనుష్‌ సరసన రజీషా విజయన్‌ నటించారు. లాల్‌, యోగిబాబు ఇతర కీలక పాత్రలను పోషించారు. దర్శకుడు మారి సెల్వరాజ్ వాస్తవిక సంఘటనల ఆధారంగా చేసుకొని హార్డ్ హిట్టింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను తెరకెక్కించాడు. తొలి ఐదు రోజుల్లో దాదాపు 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది కర్ణన్. ఒక వైపు కరోనా వైరస్ ఆంక్షలు కొనసాగిస్తున్న సమయంలోనూ ధనుష్ చెన్నై బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తున్నాడు.