బీజేపీ సర్కార్ ఉంటుందా? ఉడుతుందా? కర్ణాటక ఎగ్జిట్‌పోల్స్ ఇవిగో..

బీజేపీ సర్కార్ ఉంటుందా? ఉడుతుందా? కర్ణాటక ఎగ్జిట్‌పోల్స్ ఇవిగో..

సంచలనలకు పేరు గాంచిన కర్నాటక మరోసారి దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ కానుంది. కాంగ్రెస్-జేడీఎస్ సర్కార్‌కు చెందిన 15 మంది ఎమ్మెల్యేలను బీజీపే తనవైపు తిప్పుకుని యడ్యూరప్ప నాయకత్వంలో సర్కార్ ఏర్పాటు చేసింది. గోడదూకిన ఎమ్మెల్యేలను అప్పటి అనర్హులుగా ప్రకటించడంతో ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల తర్వాత వెలువడుతున్న ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. యడ్యూరప్ప సర్కార్ గట్టెక్కడానికి ప్రస్తుతం 6 సీట్లు తప్పని సరిగా గెలుచుకోవాలి. అయితే, ప్రముఖ మీడియా సంస్థలన్నీ 15 స్థానాలలో బీజేపీకి మెజారిటీ సీట్లు దక్కే అవకాశం ఉందని ప్రకటించాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో బీజేపీ శ్రేణులు సంతోషంతో గంతులేస్తుంటే.. కాంగ్రెస్, జేడీఎస్ కేడర్ ఉత్కంఠను ఎదుర్కొంటోంది. ఈ టెన్షన్ కు 9 తేదీన జరుగే ఓట్ల లెక్కింపుతో తెరపడుతుంది.