కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్‌ 5న పోలింగ్‌ జరగనుంది. ఫలితాలు డిసెంబర్‌ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో15మంది ఎమ్మెల్యేలపై గత ప్రభుత్వంలో స్పీకర్‌ వారిపై అనర్హత వేటు వేసారు. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. దీంతో  ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది.

డిసెంబర్ 5న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కమార్ ప్రటించారు. అయితే తమ అనర్హత వేటు మీద 17 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ బుధవారం  సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, దేశంలో మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలతో పాటే కర్ణాటక అసెంబ్లీలో 15 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడానికి ముందే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో వాటిని వాయిదా వేసింది. అప్పుడు మొత్తం 29 నామినేషన్లు దాఖలయ్యాయి. అవన్నీ ఇప్పుడు పరిగణనలోకి తీసుకుంటారని సమాచారం.