కర్ణాటకలో యెడియూరప్పకు కొత్త టెన్షన్...!

కర్ణాటకలో యెడియూరప్పకు కొత్త టెన్షన్...!

కర్ణాటకలో యెడియూరప్ప సర్కార్ మరో పరీక్ష ముందు నిలబడింది... ఇవాళ జరిగిన ఉప ఎన్నికలు అధికార భారతీయ జనతా పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారాయి. మొత్తం 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. కనీసం 8 చోట్ల బీజేపీ విజయం సాధించకపోతే కన్నడ రాజకీయం మళ్లీ హీటెక్కడం ఖాయంగా మారిపోయింది. 15 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగియగా.. ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 9వ తేదీన వెలువడే ఫలితాలపైనే ఉంది. గోకాక్, యల్లాపూర్, హైరేకెరూర్, రాణిబెన్నూర్, అథానీ, కాగ్‌వాడ్, విజయనగర్, చిక్‌బళ్లాపూర్, కేఆర్ పురం, యశ్వంతపూర్, మహాలక్ష్మీ లేఅవుగ్, శివాజీనగర్, హోస్‌కోట్, కేఆర్ పేట్, హన్సూర్‌ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ పడిపోవడం బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడంలో 17 మంది ఎమ్మెల్యేలు కీలక పాత్ర పోషించారు.. వీరిపై అనర్హత వేటు పడడంతో 15 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. కనీసం 6 స్థానాల్లో గెలిస్తేనే యెడియూరప్ప సర్కార్ నిలబడుతుంది. లేకపోతే కూలిపోవడం ఖాయమే. దీంతో ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి నెలకొంది.