వెలువడుతోన్న ఉప ఎన్నికల ఫలితాలు.. టెన్షన్‌లో కర్ణాటక సీఎం...!

వెలువడుతోన్న ఉప ఎన్నికల ఫలితాలు.. టెన్షన్‌లో కర్ణాటక సీఎం...!

కర్ణాటకలో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. యడ్యూరప్ప సర్కార్‌కు ఈ ఉప ఎన్నికలు చాలా కీలకం. పోటీ చేసిన 15 స్థానాల్లో కనీసం ఆరు స్థానాలు గెలిస్తేగానీ యడ్యూరప్ప సర్కార్ మనుగడ సాగించడం కష్టం. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కార్‌కు హ్యాండిచ్చి ప్రభుత్వాన్ని కూలదూసిన 15 మందికి టికెట్లు ఇచ్చి బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ.. జేడీఎస్ 12 స్థానాల్లో, బీఎస్పీ రెండు, ఎన్సీపీ ఒక్క సీటులో పోటీచేశాయి. అయితే, ఉప ఎన్నికలు జరిగిన 15 స్థానాల్లో బీజేపీ వైపే ఓటర్లు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కానీ, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే అసలు ఫలితాల్లో వస్తాయా? అనే టెన్షన్‌లో బీజేపీ ఉంది.