మరో సీఎంకు కరోనా పాజిటివ్

మరో సీఎంకు కరోనా పాజిటివ్

ఇంతకాలం సామాన్యులను వణికించిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రముఖులను భయపెడుతోంది. మొన్ననే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కరోనా వైరస్ బారిన పడగా తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు నిన్న రాత్రి ఆయన ట్వీట్ చేశారు.‘నాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. ప్రస్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నాను. వైద్యుల సూచన మేరకు నేను ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేసుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని కోరుతున్నా’ అని యెడియూరప్ప ట్వీట్ చేశారు. అయితే నిన్ననే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కరోనా బారిన పడ్డారు.