సిద్ధరామయ్యకు ఓటమి భయం?

సిద్ధరామయ్యకు ఓటమి భయం?
చాముండేశ్వరి నుంచి కచ్చితంగా గెలుస్తానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేస్తున్నా.. ఆయన రెండో స్థానం నుంచి పోటీ చేసే అవకాశముంది. గత ఎన్నికల్లో ఆయన చాముండేశ్వరి నుంచి కేవలం 257 ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో సిద్ధరామయ్యను బదామి నుంచి కూడా పోటీ చేయించాలని భావిస్తోంది. వరుణ నియోజకవర్గం సిద్ధరాయమ్యకు కంచుకోట. అయితే ఈ నియోజకవర్గం నుంచి తన కుమారుడు యతేంద్రను బరిలోకి దింపుతున్నారు సిద్ధరాయమ్య. పెద్ద కుమారుడు రాకేష్‌ అకాల మరణంతో యతేంద్ర రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. కంచుకోటైన వరుణ నియోజవకర్గం నుంచి కొడుకును దింపి తను మాత్రం చాముండేశ్వరి నుంచే పోటీ చేయాలని నిర్ణయించారు. కాని అధిష్ఠానం మాత్రం బదామి నుంచి కూడా సిద్ధరామయ్యను నిలపాలని భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ తుది జాబితాపై కర్ణాటకలో ఆసక్తి పెరిగింది.