త్వరలో ప్రభుత్వం కూలిపోతుంది

త్వరలో ప్రభుత్వం కూలిపోతుంది

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వికారాబాద్ జిల్లా తాండూరులోని భావిగి భద్రేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి త్వరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు. ర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 280 సీట్లు సాధించి మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని అభిప్రాయపడ్డారు.