ఎన్టీవీతో రమేష్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్టీవీతో రమేష్‌ కుమార్ సంచలన వ్యాఖ్యలు..

తాను స్పీకర్‌ చైర్‌లో ఉండి రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసి సంచలనం సృష్టించారు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్.. హైదరాబాద్‌ వచ్చిన ఆయన ఈ వ్యవహారంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. స్పీకర్‌గా నా బాధ్యత నెరవేర్చానన్న ఆయన.. మిగతా రాష్ట్రాల స్పీకర్లు.. ఎమ్మెల్యేల అనర్హతపై ఎందుకు నిర్ణయం తీసుకోరో నాకు తెలియదు..? అన్నారు. ఎమ్మెల్యేల వ్యవహారశైలి చట్టానికి వ్యతిరేకంగా ఉందని నాకు అర్థమైంది, ధైర్యం వచ్చింది అందుకే వేటువేశానని.. మిగతా ఎమ్మెల్యేలకు అంత ధైర్యం లేదేమో నని వ్యాఖ్యానించారు. తప్పుచేసినవారికి శిక్ష పడాల్సిందే నని స్పష్టం చేసిన రమేష్ కుమార్.. నేను చేసింది గొప్పపనేం కాదు.. యువతరానికి మార్గదర్శిగా నిలవాలని ఈ పనిచేశానన్నారు. కాగా, కర్ణాటక అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో బీజేపీ గెలిచిన తర్వాత.. స్పీకర్‌ పదవికి రమేష్‌కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలసిందే.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి అంత్యక్రియల కోసం హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి పై వీడియోను క్లిక్ చేయండి...