పోలీసులకు శుభవార్త.. మరో వెయ్యి అదనం.. 

పోలీసులకు శుభవార్త.. మరో వెయ్యి అదనం.. 

ప్రజల రక్షణ కోసం పోలీసులు 24 గంటలు పని చేస్తుంటారు.  ఎప్పుడు అవసరమైతే అప్పుడు అందుబాటులో ఉంటారు. అలాంటి వారికోసం కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  కర్ణాటకలో రాష్ట్ర పోలీసులకు అదనంగా వెయ్యి రూపాయల జీతభత్యాన్ని ఇవ్వాలని నిర్ణయించింది.  సీనియర్‌ పోలీస్‌ అధికారి రాఘవేంద్ర ఔరాద్కర్‌ రూపొందించిన వేతనశ్రేణి నివేదికను వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి యడ్యూరప్ప అధికారులను ఆదేశించారు.  

ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి పోలీసులు స్వాగతించారు.  తమ కష్టాన్ని ప్రభుత్వం గుర్తించిందని పోలీసులు పేర్కొన్నారు.  పోలీసుల అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.  దీపావళి కానుకగా అందిస్తున్నట్టు ప్రకటించారు.  దీని వలన రాష్ట్రప్రభుత్వానికి రూ. 128. 38 కోట్లు అదనపు భారం కానున్నది.