బళ్ళారికి 'గాలి': సుప్రీం అనుమతి

 బళ్ళారికి 'గాలి': సుప్రీం అనుమతి

అక్రమ మైనింగ్‌ కేసులు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. తీవ్ర అస్వస్థతో ఉన్న తన మామగారిని పరామర్శించేందుకు బళ్ళారి వెళ్ళేందుకు సుప్రీం కోర్టు అనుమతించింది. ఆయన బళ్ళారిలో రెండు వారాల పాటు ఉండేందుకు కోర్టు అంగీకరించింది. పలు కేసులు ఎదుర్కొంటున్న గాలిపై బళ్ళారికి వెళ్ళకూడదనే ఆంక్షలు ఉన్నాయి. దీంతో తన మామను చూసేందుకు  అనుమతి ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు గాలి జనార్ధన్‌రెడ్డి. దాదాపు మూడేళ్ళ పాటు జైల్లో ఉన్న గాలి జనార్ధనరెడ్డికి 2015లో షరతులతో సుప్రీం కోర్టు బెయిలు మంజూరు చేసింది. బళ్ళారితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలను వెళ్ళరాదని ఆంక్షలు విధించింది. దీంతో ఇపుడు మినహాయింపు కోరుతూ సుప్రీం కోర్టును ఆ్రశయించారు.