బళ్లారి వెళ్లేందుకు గాలికి సుప్రీం అనుమతి

బళ్లారి వెళ్లేందుకు గాలికి సుప్రీం అనుమతి

కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్ధన్ రెడ్డి తన సొంత జిల్లా బళ్లారి వెళ్లేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అస్వస్థతతో ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్న తన మామను పరామర్శించేందుకు బళ్లారి వెళ్లేందుకు అనుమతి కావాలంటూ గురువారం పిటీషన్ దాఖలు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ ఈమేరకు గాలి జనార్థన్ రెడ్డికి అనుమతి మంజూరు చేసింది. 2008లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అనంతరం కొలువుదీరిన బీఎస్ యడ్యూరప్ప సర్కార్ లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత మూడు సంవత్సరాలకు ఓబులాపురం మైనింగ్ అక్రమాలపై సీబీఐ గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేసింది. 2015లో అనుమతులతో కూడిన బెయిల్ ను న్యాయస్థానం మంజూరు చేసింది. బళ్లారి, అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లవద్దని షరతులు విధించింది.