ముంబైలో టెన్షన్‌.. పోలీసుల అదుపులో డీకే

ముంబైలో టెన్షన్‌.. పోలీసుల అదుపులో డీకే

కర్ణాటక మంత్రి డీకే శివకుమార్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు ఇవాళ ఉదయమే ఆయన ముంబై చేరుకున్నారు. ఎమ్మెల్యేలు కలవబోరంటూ ఆయణ్ను హోటల్‌ ముందు పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ హోటల్‌ను విడిచి వెళ్లకుండా శివకుమార్‌ అక్కడే కూర్చోవడంతో శాంతి భద్రతల దృష్ట్యా హోటల్‌ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించారు. ఈక్రమంలో కొద్దిసేపటి క్రితం డీకే శివకుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయణ్ను ఎక్కడికి తీసుకెళ్లిందీ తెలియాల్సి ఉంది.