ఆ రాజీనామాలు సక్రమంగా లేవు...

ఆ రాజీనామాలు సక్రమంగా లేవు...

కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. తనకు వచ్చిన రాజీనామాల్లో కొన్ని సక్రమంగా లేవని అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ అన్నారు. ఇప్పటి వరకు తనకు 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాలు తనకు అందాయని, వీటిలో 8 సక్రమంగా లేవన్నారు.  ఇప్పటి వరకు 16 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాజీనామా చేసిన రెబల్‌ ఎమ్మెల్యేలు ఎవరూ తనను కలవలేదని రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాసినట్లు స్పీకర్‌ మీడియాకు చెప్పారు. రాజ్యాంగ నిబంధనలను తాను కచ్చితంగా పాటిస్తానని ఆయన చెప్పారు. 13 రాజీనామాల్లో 8 చట్టాలకు అనుగుణంగా లేవని, స్వయంగా వారు వచ్చి తనను కలిసేందుకు సమయం కూడా ఇచ్చినట్లు ఆయన చెప్పారు.