రివ్యూ: దేవ్

రివ్యూ: దేవ్

నటీనటులు:  కార్తి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ తదితరులు

సంగీతం: హారిస్‌ జయరాజ్‌

సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్‌

నిర్మాత: ప్రిన్స్‌ పిక్చర్స్‌

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రజత్‌ రవిశంకర్‌

 

కార్తి విలక్షణ నటుడు.  కొత్త కొత్త కథలతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడంలో కార్తి ముందు వరసలో ఉంటాడు.  గత కొంతకాలంగా కార్తి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోతున్నాయి. ఇప్పుడు కార్తి మరో సాహసం చేసేందుకు దేవ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  మరి కార్తి చేసిన సాహసం సక్సెస్ అయిందా లేదా తెలుసుకుందాం.  

కథ

కార్తికి సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టం.  స్నేహితులతో కలిసి తిరుగుతూ.. సాహసాలు చేస్తుండే హీరో కార్తికి పేస్ బుక్ ద్వారా రకుల్ ప్రీత్ పరిచయం అవుతుంది.  రకుల్ ఓ యువ వ్యాపారవేత్త.  తనకు స్నేహితులన్నా, ప్రేమలన్నా పెద్దగా ఇష్టం ఉండదు.  చిన్నతనం నుంచి తండ్రి లేకుండా పెరగడంతో.. మగాళ్ళపైనా, ప్రేమలపైనా విరక్తి ఏర్పడుతుంది.  దేవ్ తో పరిచయం తరువాత రకుల్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి..? కార్తి ప్రేమను రకుల్ యాక్సెప్ట్ చేసిందా లేదా అన్నది కథ. 

విశ్లేషణ

సినిమాకు కథే బలం.  కథనాలు ఆ తరువాత.  కార్తి ఎంచుకున్న దేవ్ కథలో పెద్దగా కథ కనిపించదు.  థ్రిల్లింగ్ అనిపించే సన్నివేశాలు ఉన్నా వాటిని మాములుగా తీయడంతో సినిమా తేలిపోయింది.  దేవ్ పాత్రను, రకుల్ మేఘన పాత్రను పరిచయం చేయడానికి ఎక్కువ సన్నివేశాలను వాడుకున్నాడు దర్శకుడు.  దీంతో కథ ఎలా నడుస్తుందో సగటు ప్రేక్షకుడికి అర్ధం కాదు.  కథ పరంగా తీసుకుంటే.. థ్రిల్లింగ్ కలిగించే ట్విస్ట్ లను రాసుకునే ఛాన్స్ ఉన్నా.. దర్శకుడు ఎందుకు నిర్లక్ష్యం చేసాడో అర్ధం లేదు.  ఫస్ట్ హాఫ్ లో రకుల్ ను ప్రేమలో పడెయ్యడంతో ముగిస్తే.. సెకండ్ హాఫ్ లో వారు తిరిగి ఎలా కలుసుకున్నారు అనే విషయాలను చూపించారు.  క్లైమాక్స్ లో కార్తి ఎవరెస్టు ఎక్కే సన్నివేశం థ్రిల్లింగ్ ను కలిగిస్తుంది.  

నటీనటుల పనితీరు: 

కార్తిలోని నటుడిని దర్శకుడు సరిగా వాడుకోలేదని సినిమా చూస్తే అర్ధం అవుతుంది.  ఎక్కడా చాలెంజింగ్ అనిపించే సన్నివేశాలు లేకపోవడం విశేషం.  రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర చాలా సీరియస్ గా సాగుతుంది.  గ్లామర్ కు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు.  డబ్బింగ్ కూడా సో సో గా ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. 

సాంకేతిక వర్గం పనితీరు: 

దర్శకుడు కథను ఇంకాస్త బలంగా రాసుకొని ఉంటె చాలా బాగుండేది.  థ్రిల్లింగ్ గా పనిచేసుకునే సన్నివేశాలను రాసుకునే స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఎందుకనో వాటిని వదిలేశాడు.  సినిమాకు ఫొటోగ్రఫీ ప్లస్ అయ్యింది.  హరీష్ జైరాజ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 

పాజిటివ్ పాయింట్స్: 

కార్తి 

సాంకేతిక విలువలు 

మైనస్ పాయింట్స్; 

కథ 

కథనాలు 

చివరిగా : దేవ్ సాహసం వృధా అయ్యింది.