కార్తీ దేవ్ టీజర్ డేట్ ఫిక్స్

కార్తీ దేవ్ టీజర్ డేట్ ఫిక్స్

కోలీవుడ్ హీరో కార్తీకి టాలీవుడ్ లోను మంచి మార్కెట్ ఉన్నది.  ఇటీవలే ఆయన నటించిన చినబాబు సినిమా తెలుగులోను మంచి విజయం సాధించింది.  రెండు చోట్ల మంచి మార్కెట్ ఉండటంతో రెండు ఇండస్ట్రీలపై దృష్టి పెట్టిన కార్తీ ప్రస్తుతం దేవ్ అనే సినిమాను చేస్తున్నారు.  హ్యారిస్ జై రాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అయింది.  ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 5 వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.  

ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.  ఖాకీ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు.  ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.