ఆ ప్రయోగం వర్కౌట్ అవుతుందా కార్తీ..

ఆ ప్రయోగం వర్కౌట్ అవుతుందా కార్తీ..

కార్తీ హీరోగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు.  ప్రస్తుతం ఖైదీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.  జైలు నుంచి తప్పించుకున్న ఓ ఖైదీకి ఎదురైన అనుభవాలు... వాటి పరిణామాలు ఏంటి అనే దాని చుట్టూ కథ చాలా ఆసక్తికరంగా తిరుగుతుంది.  ఈ కథలో హీరోయిన్ అవసరం లేదు కాబట్టి ఆ పాత్రను తీసుకోలేదని తెలుస్తోంది.  హీరోయిన్ ను తీసుకుంటే... కథలో ఇరికించినట్టు ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆ పాత్రను పక్కన పెట్టేసి.. హీరోయిన్ లేకుండానే సినిమాను పూర్తి చేశారు.  

సందీప్ కిషన్ తో మానగరం సినిమాను తీసిన కనగరాజ్ ఈ సినిమాకు దర్శకుడు.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఇప్పటికే రిలీజ్ చేశారు.  ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  కార్తీ చేస్తున్న ఈ ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.