నిన్న మెగాస్టార్.. ఇప్పుడు పవర్ స్టార్ టైటిల్ తో కార్తీ... 

నిన్న మెగాస్టార్.. ఇప్పుడు పవర్ స్టార్ టైటిల్ తో కార్తీ... 

మెగాస్టర్ ఖైదీ టైటిల్ తో వచ్చిన తమిళ హీరో కార్తీ తెలుగులో మంచి హిట్ కొట్టాడు.  తమిళ సినిమా అయినప్పటికీ సినిమాలో దమ్మున్న కంటెంట్ ఉండటంతో సినిమాకు మంచి రేటింగ్ వచ్చింది. మౌత్ టాక్ తో సినిమా కలెక్షన్ల పరంపర కొనసాగుతోంది.  ఇప్పుడు ఈ కార్తీ మరో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా క్రిస్మస్ రోజున రిలీజ్ కాబోతున్నది.  

దృశ్యం వంటి అద్భుతమైన సినిమాను తీసిన జీతూ జోసెఫ్ కార్తీ తో ఓ సినిమా చేస్తున్నది.  అక్క సెంటిమెంట్ తో సాగే ఈ సినిమాలో కార్తీకి అక్కగా సూర్య భార్య కార్తీ వదిన జ్యోతిక అక్కగా నటిస్తోంది. ఈ సినిమాకు తమిళంలో తంబీ అనే టైటిల్ పెట్టారు.  తంబీ అంటే అర్ధం తమ్ముడు అని.  అంటే తెలుగులో తమ్ముడు అనే టైటిల్ టోన్ సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉన్నది.  క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.  అదే రోజున బాలకృష్ణ రూలర్, సాయి ధరమ్ తేజ్ ప్రతి రోజు పండుగే, సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.