'వరల్డ్‌కప్‌ టీమ్‌లో కార్తీక్‌ కచ్చితంగా ఉంటాడు'

'వరల్డ్‌కప్‌ టీమ్‌లో కార్తీక్‌ కచ్చితంగా ఉంటాడు'

మే 30న ప్రారంభమవనున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ కోసం అన్ని జట్లూ ఆటగాళ్లను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి. ఫైనల్‌ 15లో ఎవరెవరు ఉండాలనే విషయమై ఇప్పటికే అన్ని జట్టూ ఓ అంచనాకు రాగా.. ఆ విషయంలో టీమిండియా మాత్రం ఇంకా వెనుకబడే ఉంది. నంబర్‌ 4 స్థానంతోపాటు బ్యాకప్‌ కీపర్‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయమై క్లారిటీ మిస్‌ అయింది. ఈ గ్యాప్‌లో.. ఫైనల్‌ 15లో ఎవరెవరు ఉండాలన్నదానిపై  వెటెరన్ క్రికెటర్లు ఒక్కొక్కరూ ఒక్కోలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషయమై తాజాగా.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌ స్పందించాడు. దినేష్‌ కార్తీక్‌ వరల్డ్‌కప్‌కు ఎంపికవుతాడని కాటిచ్‌ ధీమా వ్యక్తం చేశాడు. మంచి ఫినిషర్‌గా పేరుతెచ్చుకున్న కార్తీక్‌కు డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేయడం చాలా కష్టమని అన్నాడు. కార్తీక్‌ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందన్న కాటిచ్‌.. ఇటీవల కాలంలో భారత జట్టు తరఫున అతడు మ్యాచ్‌లు ముగించిన తీరు అద్భుతమన్నాడు. ఈ ఐపీఎల్‌లోనూ కార్తీక్‌ ఫినిషర్‌ రోల్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలున్నాయని కాటిచ్‌ చెప్పాడు.