మరోసారి 'ఆర్ఎక్స్ 100' లాంటి కథ !

మరోసారి 'ఆర్ఎక్స్ 100' లాంటి కథ !

'ఆర్ఎక్స్ 100' చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.  నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ ప్రేమకథా చిత్రానికి యువత బ్రహారథం పట్టారు.  ఈ సినిమాతో వాస్తవ కథలకు డిమాండ్ బాగా పెరిగింది.  అందుకే అదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు ఆ చిత్ర హీరో కార్తికేయ.  'ఆర్ఎక్స్ 100' లాంటి రియలిస్ట్ కథతో ఇంకో సినిమా చేయనున్నాడు ఈ యువ హీరో.  ఇది కూడా ప్రేమ కథే కావడం విశేషం.  ఈ సినిమా టైటిల్, ఇతర వివరాల్ని కార్తికేయ రేపు అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.