కరుణానిధి పాటకు రెహమాన్ ట్యూన్ కట్టిన వేళ !

కరుణానిధి పాటకు రెహమాన్ ట్యూన్ కట్టిన వేళ !

దివంగత కరుణానిధిగారి గురించి మాట్లాడితే ముందుగా ఆయనొక సినీ అని ప్రారంభించాల్సిందే.  కల, సాహిత్యంపై అమితమైన మక్కువ కలిగిన కరుణానిధి తాను ముఖ్యమంత్రిగా ఉన్న 2010లో వరల్డ్ క్లాసికల్ తమిళ్ కాన్ఫరెన్స్ కోసం 'సెమ్మోజి' పేరుతో ఆయనకొక పాటను స్వయంగా రాశారు. 

దానికి ట్యూన్స్ కట్టడం కోసం అప్పటికే సంగీత ప్రపంచంలో బాగా పాపులర్ అయిన ఏఆర్.రెహామన్ ను పిలిపించారాయన.  రెండున్నర నెలలు సమయం తీసుకున్న రెహమాన్ సుమారు 70 మంది ప్లేబ్యాక్ సింగర్లతో ఆ పాటను రూపొందించారు.  కరుణానిధి కూడ కాసేపు కనిపించే ఆ వీడియోను గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేశారు.  ఫైనల్ గా వీడియోను చూసిన కరుణానిధి చాలా బాగుందని రెహమాన్ ను మెచ్చుకున్నారు కూడ.  2010 మే నెలలో విడుదలైన ఈ పాట అపూర్వమైన విజయాన్ని దక్కించుకుని తమిళజాతి గీతంగా పేరుపొందింది.