రిటైర్‌ అయిన డ్రైవర్‌కు కలెక్టర్ ఘనంగా వీడ్కోలు

రిటైర్‌ అయిన డ్రైవర్‌కు కలెక్టర్ ఘనంగా వీడ్కోలు

ఏ హోదాలో ఉన్న అనునిత్యం తమకు చేదోడువాదోడుగా ఉండేవారి సేవలను మర్చిపోవడం అంత సులభమైన విషయం కాదు... ఇక నమ్మినబంటుగా ఉండేవారిని వదులుకోవడానికి ఏ నేత అయినా... ఏ అధికారి అయినా అంగీకరించరు.  అది అలా ఉంటే... తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తి రిటైర్డ్ అయితే ఘనంగా వీడ్కోలు పలికారు కరూర్ జిల్లా కలెక్టర్. తమిళనాడులోని కరూర్‌ కలెక్టర్‌కు డ్రైవర్‌ అందించిన సేవలు మర్చిపోకుండా.. వీడ్కోలు పార్టీకి హాజరు కావడమే కాదు... ఆ డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ స్వయంగ కలెక్టర్ కారు నడుపుతూ ఆ డ్రైవర్‌ను ఇంటి వరకు డ్రాప్ చేసి వీడ్కోలు పలికి... తను అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలిపారు.  అందరూ పనిచేయించుకున్నా... తనకు సేవ చేసినవారిని గౌరవంగా చూడడం కొందరికే సాధ్యం.