ఆర్టికల్ 370 రద్దుపై కాశ్మీర్ చివరి యువరాజు ఏమన్నారంటే..!!

ఆర్టికల్ 370 రద్దుపై కాశ్మీర్ చివరి యువరాజు ఏమన్నారంటే..!!

ఆగష్టు 5 భారత దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు.  జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కావాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. మొన్నటి వరకు అది సాధ్యం కాలేదు.  ఆగస్టు 5 వ తేదీన మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి సంచలనం సృష్టించింది.  ఈ ఆర్టికల్ రద్దుతో పాటు జమ్మూ కాశ్మీర్ ను పునర్విభజన చేసింది.  జమ్మూ కాశ్మీర్, లడక్ లుగా విభజించారు.  జమ్మూ కాశ్మీర్ ను చట్టసభలలో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగాను, లడక్ ను చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతంగాను ప్రకటించారు.  

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశంలోని కొన్ని పార్టీలు మినహా మెజారిటీ పార్టీలు ఆహ్వానించాయి. జమ్మూ కాశ్మీర్ సంపూర్ణంగా భారతదేశంలో అంతర్భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశాయి.  ఆర్టికల్ 370 రద్దుపై జమ్మూ కాశ్మీర్ మహారాజా హరిసింగ్ కుమారుడు డాక్టర్ కరణ్ సింగ్ స్పందించారు.  లడక్ ప్రాంతం ప్రజలు కేంద్రపాలిత ప్రాంతం కావాలని కోరుకుంటున్నారని, ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ అన్నిరకాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్టు కరణ్ సింగ్ పేర్కొన్నారు.  కరణ్ సింగ్ జమ్మూ కాశ్మీర్ కు చివరి యువరాజు.  చాలా కాలంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.