కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది.. రెచ్చగొట్టకండి..!!

కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది.. రెచ్చగొట్టకండి..!!

ఆగష్టు 5 వ తేదీన జమ్మూ కాశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసందే.  జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు చేసింది.  ఆర్టికల్ రద్దు తరువాత అక్కడ భారీ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు.  భద్రతా బలగాల నీడలో జమ్మూ కాశ్మీర్ ఉండిపోయింది.  అక్టోబర్ 31 వ తేదీన జమ్మూ కాశ్మీర్ అధికారికంగా కేంద్రపాలిత ప్రాంతంగా మారిపోయింది.  అప్పటి నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాయి.  అక్కడ అల్లర్లు తగ్గాయి.  

ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు పార్లమెంట్ లో పేర్కొన్నారు.  ఇంటర్నెట్ వంటి వాటిని త్వరలోనే పునరుద్ధరిస్తామని చెప్పారు.  అయితే, పాకిస్తాన్ తో ఉన్న గొడవల కారణంగా ఇంటర్నెట్ పునరుద్దరించలేదని పేర్కొన్నారు.  దీనిపై కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ కొన్ని ప్రశ్నలు అడిగారు. స్కూల్స్ కాలేజీలు తెరుచుకున్నాయి ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాలేదని, ఇంటర్నెట్ అందుబాటులో లేకుంటే, పిల్లలు ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.  పాకిస్తాన్ తో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నా ఇప్పుడు ఎందుకు ఇంటర్నెట్ ను బంద్ చేశారని ప్రశ్నించారు.  దీనికి అమిత్ షా గట్టిగా జవాబిచ్చారు.  దేశ భద్రత గురించి ఆలోచించినప్పుడు కొన్ని సందర్భాల్లో అవసరాలను పక్కన పెట్టాల్సి వస్తుందని అన్నారు.  ప్రస్తుతం కాశ్మీర్ ప్రశాంతంగా ఉందని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చెయ్యొద్దని అమిత్ షా పేర్కొన్నారు.